ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌనిపాతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మోహనరెడ్డి, ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు నరేష్, ఇతర నాయకులు బుధవారం అనంతపురం డీఈఓ ప్రసాద్బాబును ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో అపార్ ఐడీ జనరేట్ కోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని ఉపా ధ్యాయ సంఘాలతో తరచూ కో- ఆర్డినేషన మీటింగ్ నిర్వహించి, టీచర్ల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కా వాలని కోరారు. ఆ సంఘం నాయకులు గురురాజు, సాంబశివారెడ్డి, సూర్యనారాయణ, లక్ష్మన్న, ఎల్లప్ప, ఈశ్వరయ్య, ప్రభాకర్, మదన తదితరులు పాల్గొన్నారు.