ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగం శరవేగంగా విస్తరిస్తుండటంలో కామర్స్ విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ఇంటర్‌లో సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీకాం కోర్సులో చేరొచ్చు.
దీంతో పాటు ప్రతిష్టాత్మక జాబ్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎస్ వంటి కోర్సులను పూర్తిచేయొచ్చు. బీకాం పూర్తయ్యాక రెగ్యులర్‌గా మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎంబీఏ), ఎంకాం (మాస్టర్ ఆఫ్ కామర్స్) తదితర కోర్సుల్లో చేరొచ్చు.