శరీరంలో అన్ని క్రియలు సరిగ్గా జరగాలంటే నీరు చాలా అవసరం. అందుకే తరచూ నీళ్లు తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సమృద్ధిగా నీళ్లు తాగడం వల్ల చర్మం నిగ నిగలాడుతూ.. ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. దాహం అయితేనే నీళ్లు తాగడం అనేది కాకుండా... కనీసం గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకోవడమూ మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.