చలికాలంలో పెదవులు తరచుగా పగులుతుంటాయి. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు ఈ పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంటుంది. అయితే ఈ పగుళ్లను నయం చేయడానికి కలబంద కూడా సహాయపడుతుందని కొంతమంది అంటుంటారు. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడానికి, అలర్జీల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అయితే కలబందను మాయిశ్చరైజర్ తో కలిపి తీసుకోవడం ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.