వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. కణాల ఆరోగ్యం బాగా ఉంటుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.