వెల్లుల్లిని శతాబ్దాలుగా అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని కాల్చడం వల్ల దాని రుచి పెరుగుతుంది. కాల్చిన వెల్లుల్లి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, ప్రేగు పనితీరును ప్రోత్సహిస్తుంది. వేయించిన వెల్లుల్లి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తుంది. కాల్చిన వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.