ఆధునిక క్రికెట్‌లో సాధారణంగా బ్యాట్లు కిలో నుంచి కిలోన్నర బరువు ఉంటాయి. కొందరు లైట్ వెయిట్ ఉన్నవి, మరికొందరు హెవీ వెయిట్ ఉన్న బ్యాట్లు వాడుతున్నారు. ఓ క్రికెట్ బ్యాట్ 38 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు.
అలాగే వెడల్పు 4.25 అంగుళాలు, అంచుల మందం 1.56 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదన్న నిబంధన ఉంది. కొలతలపై ఉన్న పరిమితుల ఆధారంగా క్రికెట్ బ్యాట్ 900 గ్రాముల నుంచి 1.6 కిలోల వరకూ ఉంటుంది.