గోరింటాకు అందానికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోరింటాకులో ప్రొటీన్, విటమిన్ ఎ, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఉన్నాయి. దీని ఆకులతో చేసిన పేస్ట్ జ్వరం వచ్చినప్పుడు చేతులు, కాళ్లకు రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇది గాయాలను నయం చేస్తుంది. 15 నుండి 20 తాజా గోరింట ఆకులను గ్రైండ్ చేసి, వాటిని 500 మి.లీ నీటిలో మరిగించి, వారం రోజుల పాటు తింటే కిడ్నీలో స్టోన్ సమస్య నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది.