ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ స్థానంలో రజత్ పటిదార్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
గత ఏడాది డిసెంబర్ 21న సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రజత్ పటిదార్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 137.50 స్ట్రయిక్ రేట్‌తో 16 బంతుల్లో 22 రన్స్ స్కోర్ చేశాడు.