ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖ వేదికగా రెండోటెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్ట్ మ్యాచ్లో ఓటమిని చవిచూసిన భారత జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. దీంతో రెండో టెస్టులో తమ సత్తా చాటేందుకు రోహిత్ సేన కసరత్తులు చేస్తోంది. గత మ్యాచ్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ గెలుపు కోసం కొత్త వ్యూహాలను రచిస్తోంది.