సాధారణంగా ఇతర కూరగాయల కంటే బంగాళదుంపలు ఎక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. అవి శరీరంలో కొవ్వును పెంచుతాయి. కనుక రోజూ బంగాళాదుంపలు తింటే.. ఊబకాయం పెరగవచ్చు. డయాబెటిక్ రోగులకు బంగాళాదుంప ప్రమాదకరం.
తరచుగా అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడితే.. లేదా శరీరంలో చక్కెర స్థాయి పెరిగితే, బంగాళాదుంపలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. వారానికి రెండు రోజులు తింటే ఎలాంటి హాని జరగదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.