ఒకప్పుడు సాస్ లను ఫ్రైడ్ ఫుడ్స్ లలో ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు సాస్ ల వాడకం పెరిగింది. అయితే స్వీట్ సాస్‌లకు బదులు మసాలా సాస్ లను వాడితే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం మసాలా రుచిని ఇస్తుంది. క్యాప్సైసిన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. మైగ్రేన్, కీళ్ల నొప్పులకు చెక్ పెడతాయి. ఈ సాస్ మితంగా తీసుకుంటే మంచిది.