ఆర్‌బీఐ తాజా ఆంక్షల వల్ల పొదుపు ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్, ఎన్‌సీఎంసీ ఖాతాల్లో ఇప్పటికే ఉన్న డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) స్పష్టం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న సొమ్మును నిస్సంకోచంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో వ్యాపారులకు సేవలందించే పేటీఎం పేమెంట్ గేట్‌వే బిజినెస్ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని వెల్లడించింది.