ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల వెన్నునొప్పి, అధిక బరువు, టైప్-2 డయాబెటిస్, గుండె సమస్యలు, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. కండరాలు కదులుతున్నప్పుడు.. లిపోప్రొటీన్ లిఫేజ్ లాంటి అణువులను విడుదల చేస్తాయి. ఇది కొవ్వులు, చక్కెరలను ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది. ఒకే చోట కూర్చోవడం వల్ల ఈ అణువుల విడుదల తగ్గే ప్రమాదం ఉంది.