వేపలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి వేప చక్కగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యలు, జుట్టు సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. అలాగే ముడతలు, మొటిమలను నయం చేయడానికి సహాయపడుతుంది. వేపతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎండపెట్టి పొడిగా చేసుకున్న ఒక స్పూన్ వేప పౌడర్ లో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.