దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 440.33 పాయింట్లు లాభపడి 72,085.63 వద్ద, నిఫ్టీ 156.35 పాయింట్లు పెరిగి 21,853.80 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి పవర్‌గ్రిడ్, NTPC, TCS, టాటా స్టీల్, JSW స్టీల్ లాభాల్లో ఉండగా, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ITC నష్టపోయాయి.