* పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే తలనొప్పి తొందరగా తలెత్తదు.
* పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా నూరి, ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి.
* ఎండకాలంలో రోజుకో గ్లాసు పుదీనా రసం తాగితే శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా సమన్వయమవుతుంది. పిల్లలకు పుదీనా రసాన్ని తాగించడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది.