జింబాబ్వే మహిళా క్రికెటర్ బిలావుడ్ బీజ అరుదైన ఘనత సాధించింది. కేవలం 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసింది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో బీజాకు తుది జట్టులో చోటు దక్కింది.
దీంతో జింబాబ్వే మహిళా క్రికెట్లో ఆరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కురాలిగా ఈమె చరిత్ర సృష్టించింది. కాగా అతి తక్కువ వయసులో క్రికెట్లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ ప్లేయర్ సజ్జిధా షా(12 ఏళ్లకే) పేరిట ఉంది.