నిలబడడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని ఎంత మందికి తెలుసు. నిలబడి ఉంటే మీరు కూర్చున్నదానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఇది వెంటనే తేడా కనిపించకపోయినా త్వరగానే రోజులు గడిచే కొద్దీ తెలుస్తుంది.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
సరైన పోశ్చర్..
కేలరీల బర్న్ చేసేందుకు నిలబడడం చాలా ముఖ్యం. ఎంత సేపు నిల్చోవాలనేది మన బరువు, వయసు, జీవక్రయ, ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఎక్కువగా కూర్చుని ఉండడం కంటే నిల్చుంటే జీవక్రియ మెరుగ్గా మారి వెయిట్ కూడా మెంటెయిన్ చేయగలరు.
కేలరీల బర్న్..
కూర్చోవడం కంటే నిలబడడం వల్ల కాళ్ళు, కోర్, వెనుక భాగంలో మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నిలబడితే మీ మజిల్ మాస్ బెటర్‌గా ఉంటుంది. ఈ సమయంలో కేలరీలు బర్న్ అవుతాయి. శరీరం ఫ్లెక్సిబిలిటీ సరిగ్గా ఉంటుంది.
అనుకున్నంతగా బరువు తగ్గడం..
నిల్చోవడం వల్ల కేలరీలు బర్న్ అయినప్పటికీ, ఇది నాన్ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ అంటే రోజువారీ పనులు చేసినప్పుడు ఖర్చయ్యే కేలరీల కంటే ఎక్కువగా బర్న్ అయినప్పటికీ ఇది మరీ ఎక్కువగా బరువు తగ్గించేలా ఉండదు.
బ్యాలెన్స్ చేయడం..
కేవలం నిలబడి కేలరీలను ఖర్చు చేయడం సరికాదు. డెయిలీ వర్కౌట్ రొటీన్ ఉండాలి. వర్కౌట్స్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. వీటితో పాటు నిలబడుతుంటే సరైన విధంగా బరువు తగ్గుతారు.
బెటర్ రిజల్ట్స్ కోసం..
మీరు మధ్యాహ్నం వేల 10 నుంచి 15 నిమిషాల వరకూ నిలబడొచ్చు. దీని బెనిఫిట్స్ తెలుసు కాబట్టే చాలా మంది వర్క్ చేసేటప్పుడు 30 నిమిషాలకి ఓ సారి లేచి నిలబడాలని సలహా ఇస్తారు. . దీని వల్ల కేలరీలు ఖర్చవుతాయి. కానీ, బరువు తగ్గడానికి హెల్ప్ మాత్రం అవ్వదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.