దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా తినేది వైట్ రైస్. ఇది తినకుంటే ఆహారం తిన్నట్టుగానే అనిపించదు. రోజులో కచ్చితంగా ఒక్కసారైనా వైట్ రైస్ తింటుంటారు. లేకుంటే భోజనం చేసిన ఫీలింగ్ కలగదు. ఈ ప్రధానమైన ఆహారాన్ని చేర్చుకుంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. సులభంగా జీర్ణమవుతుంది. ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి వైట్ రైస్ ఉత్తమమైన ఆహారం అని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. బరువు పెరిగేందుకు ఉపయోగం. అయితే వైట్ రైస్ ఎక్కువ మెుత్తంలో మాత్రం అస్సలు తీసుకోకూడదు.