మద్యం తాగితే వచ్చే సమస్యలు మన అందరికీ తెలుసు. కానీ అంత ఈజీగా మానేయరు. 28రోజుల పాటు మద్యం మానేస్తే చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 28రోజులు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆల్కహాల్ కంటే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. జీర్ణసమస్యలు క్లియర్ అవుతాయి. ముఖంలో చాలా మార్పులు మొదలవుతాయి.
మద్యం అలవాటు ఉన్న వారిలో సగటు వ్యక్తి సంవత్సరానికి 9.5 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొందరు అప్పుడప్పుడు తాగేవారు ఉన్నారు. 28 రోజుల పాటు మద్యాన్ని మనేయకపోతే శరీరంపై అనేక ప్రభావాలు ఏర్పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మందు 28 రోజులపాటు మానేస్తే.. మొదటి వారంలో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కాలేయం కొద్దికొద్దిగా శుభ్రపరచడం ప్రారంభమవుతుంది. జీర్ణసమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.