అందాన్ని పెంచడంలో బాదంపప్పు బాగా పనిచేస్తోంది. జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ముఖ అందాన్ని పెంచేందుకు ముందుగా బాదంలను పాలలో వేసి నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత చక్కని పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేసి ఆరిపోయాక స్క్రబ్ చేస్తూ గోరువెచ్చని నీటితో క్లీన్ చేయండి. దీని వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. వారానికి ఒకట్రెండు సార్లు ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
మచ్చలను తగ్గించే: టిప్స్ చాలామందికి ముక్కుపై మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సింపుల్ టిప్స్‌తో ముక్కుపై నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటి తొక్క నల్ల మచ్చలను ఈజీగా పోగొడుతుంది. కొంచెం పసుపులో కొబ్బరినూనె మిక్స్ చేసి మచ్చలపై రాయాలి. ఇలా వారానికి 3సార్లు చేయాలి. తేనె కూడా నల్ల మచ్చలను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ముల్తానీ మట్టి, గుడ్డులోని తెల్లసొన కూడా నల్లమచ్చలను తొలగిస్తుంది.