ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే జామపండును పేదవాడి యాపిల్‌గా కూడా పిలుస్తారు. జామపండుకు బ్లాక్ సాల్ట్ కలిపి తింటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి బయటపడొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జామపండు రోగనిరోధక శక్తికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్లు బీ2, ఇ,కె పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు కాల్షియం, ఫోలేట్, ఫైబర్, కాపర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. కొవ్వును కూడా కరిగిస్తుంది.