బరువు పెరగడం కంటే బరువు తగ్గడం చాలా కష్టం. దీని కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. బరువు తగ్గాలంటే స్ట్రీట్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే.. గుజరాత్‌లోని ప్రసిద్ధ వంటకాలు ధోక్లా, కార్న్ చాట్ మొలకలు లేదా చనా చాట్‌లో ప్రొటీన్‌తో పాటు పీచు పదార్థాలు ఉండటం వల్ల తిన్నవారు బరువు తగ్గే ఆవకాశాలు ఉంటాయి.
క్యారెట్ జ్యూస్ రోజూ తాగితే: క్యారెట్‌లను సాధారణంగా కూరగాయగా తరచుగా వండుతారు లేదా సలాడ్‌లలో ఉపయోగిస్తారు. అయితే ఇటీవల పలు అధ్యయనాలు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే అసాధారణ ప్రయోజనాలను తెలిపాయి. క్యారెట్‌లో విటమిన్ ఎ,బీ,సీ,ఇ లతోపాటు పొటాషియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, ఐరన్, అయోడిన్, కాల్షియం ఉన్నాయి. క్యారెట్ గుండెకు, కళ్లకు మంచిది. రోజూ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కుదుళ్లు గట్టిపడుతాయి. పురుషుల్లో వీర్య వృద్ధిరేటును పెంచుతుంది.