సహజంగా నిమ్మకాయలు ఎండిపోతే పారేస్తాము. అయితే ఎండిన నిమ్మకాయల్లో కూడా పుష్కలంగా పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎండిన నిమ్మకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, చక్కెర, ఫైబర్, కొవ్వు ప్రోటీన్లు ఉంటాయి. బరువు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ మెరుగుపరటానికి, కీళ్ల సమస్యలు, మలబద్ధకం సమస్యలకు ఎండు నిమ్మకాయలు చెక్ పెడతాయి. ఎండు నిమ్మరసం తీసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.