టీమిండియా పేసర్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ తన శరీరాకృతిపై నెట్టింట ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. అయితే, సంజనా శరీరాకృతిపై ‘మీరు చాలా లావుగా ఉన్నారు’ అంటూ ఓ నెటిజన్ అనుచిత కామెంట్ చేశాడు. ఇందుకు.. సంజనా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.‘‘సైన్స్ పుస్తకాల్లో మీరు చదువుకున్న విషయాలు గుర్తులేవా..? మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి మీకెంత ధైర్యం? వెళ్లిపో ఇక్కడి నుంచి..!’’అని సంజనా బదులిచ్చారు.