చాలా మందికి రోజూ పెరుగు అలవాటు ఉంటుంది. భోజనం తినడం పెరుగుతో ముగిస్తారు. మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా భోజనం చివరలో పెరుగు వేసుకుని తినడం మంచిది. పెరుగులో ఉండే ప్రొబయాటిక్ బ్యాక్టీరియా వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పెరుగులో ఉండే ప్రొబయాటిక్స్ తో పాటు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. పెరుగు ఆకలిని నియంత్రించి బరువును తగ్గిస్తుంది. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే విధంగా పెరుగులోని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.