చాలా మంది పుదీనా ఆకులను కేవలం ఒక సువాసన ఇచ్చే ఆకుగా మాత్రమే చూస్తారు. కానీ.. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనా వాసన చూస్తేనే మూడ్ అంతా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తుంది. వంటల్లోనూ మంచి రుచి, వాసన అందించడానికి పుదీనాను వాడుతుంటారు. పుదీనా వంటల టేస్ట్ పెంచడానికే కాదు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ తినడం వల్ల చర్మానికి చాలా చలవ చేస్తుంది. ముఖంపై మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.