దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 277.98 పాయింట్లు లాభపడి 71,833.17 వద్ద, నిఫ్టీ 96.80 పెరిగి 21,840.05 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి SBI, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, NTPC లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, TCS, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.02 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.