సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. 500 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు డ్వేన్ బ్రావో(624), రషీద ఖాన్ (556), సునీల్ నరైన్ (532) ఈ మార్కును తాకారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తాహిర్.. ఖుల్నా టైగర్స్‌తో నిన్న(ఫిబ్రవరి 13న) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.