ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య కాసేపట్లో మూడో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయనున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇది 100వ టెస్టు కావడం విశేషం. ఈ సిరీస్‌లో జరిగిన రెండు టెస్టుల్లో భారత్, ఇంగ్లాండ్ 1-1తో సమంగా ఉన్నాయి.
ఇండియా (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(w), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), బెన్ ఫోక్స్(w), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.