ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరోలా’ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది.‘మోటో జీ04’ పేరుతో కంపెనీ గురువారం (ఫిబ్రవరి 15) భారత్‌లో లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌లో లేటెస్ట్ ఎంట్రీగా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. భారత్‌లో మోటో జీ04 అమ్మకాలు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆరంభం అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు.
Moto G04 Price:
మోటో జీ04 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్‌లో వస్తోంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 22 నుంచి మొదలవనుండగా.. కొనుగోలుదారులు ట్రేడ్-ఇన్ డీల్స్‌పై రూ.750 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగు (కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ మరియు సన్‌రైజ్ ఆరెంజ్) ఎంపికలలో లభిస్తుంది.
Moto G04 Specs:
మోటో జీ04 స్మార్ట్‌ఫోన్‌లో 6.56 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది 1612 x 720p రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. యూనిసోక్ T606 ప్రాసెసర్ అమర్చారు. మోటో జీ04 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14తో పనిచేస్తుంది. ఈ ఫోన్ బరువు 178.8 గ్రాములు.
Redmi A3 Price: భారత మార్కెట్‌లోకి రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
Moto G04 Battery and Camera:
మోటో జీ04 ఫోన్ వెనక 16ఎంపీ ప్రధాన కెమెరా ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ ఇచ్చారు. వీడియోకాల్స్, సెల్ఫీ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.