కివీ పండు ఇప్పుడు తక్కువ ధరకే మార్కెట్ లో విరివిగా దొరుకుతోంది. విటమిన్-సి పుష్కలంగా ఉండే ఈ పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్ వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవన్నీ వివిధ ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేస్తాయి. అంతేకాకుండా కివీ పండు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది. విటమిన్-సి లోపంతో బాధపడుతున్న వాళ్లు కివీ పండ్లు తింటే ప్రయోజనం ఉంటుంది.