ఎండాకాలం అధిక వేడివల్ల ప్రజలు తరచుగా అలసిపోతారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాల ఆహారాలను తింటారు. కానీ మీరు డైట్‌లో నీరు అధికంగా ఉండే ఆహారాలని చేర్చుకుంటే మంచిది. ఇందులో పుచ్చకాయ, టమోటా, పెరుగు, దోసకాయ, కొబ్బరి నీరు ఉండేలా చూసుకొండి. ఎందుకంటే.. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తాయి. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పనిచేస్తుంది.