ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విటర్) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో రికార్డు స్థాయిలో 2,31,215 ఖాతాలను నిషేధించింది.
డిసెంబర్ 26 మరియు జనవరి 25 మధ్య భారీగా ఖాతాలపై నిషేధం విధించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే కారణంగా మరో 1,945 ఖాతాలను కూడా తొలగించింది. నూతన ఐటీ రూల్స్-2021కి అనుగుణంగా నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాలపై నిషేధం విధించినట్లు ఎక్స్ తాజాగా పేర్కొంది.