కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పరీక్షల నిర్వహణ విధానాన్ని బోర్డు మార్చబోతోంది. వాటిని విద్యార్థులకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించి మెరుగైన మార్కులు సాధించే ప్రయత్నంలో భాగమే ఈ విప్లవాత్మక మార్పులు.
ఇందులో భాగంగా 10, 12వ తరగతి విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. అదేమిటంటే- ఒక రౌండ్‌లో బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థులు అందులో ఆశించిన మార్కులు రాకపోతే, ఈ కొత్త విధానంలో మళ్లీ అవే పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది.