వెబ్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను వాట్సప్ తీసుకురానుంది. సెక్యూరిటీ ఫీచర్ పేరిట యాప్‌లో లాక్ చేసిన చాట్‌లను వెబ్‌లో యాక్సెస్ చేసుకునేందుకు ప్రత్యేకంగా సీక్రెట్ కోడ్ అవసరమయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతోంది. తద్వారా ఇటీవలే తీసుకొచ్చిన ‘లాక్ చాట్’ ఫీచర్‌ను వెబ్ వెర్షన్‌కూ విస్తరించే యోచనలో ఉంది. ఈ కొత్త ఆప్షన్ ఇంకా డెవలప్‌మెంట్ దశలో ఉందని తెలిపింది.