వ్యాయామం అనంతరం కండరాలు పట్టేసినట్లు ఉండటం, నొప్పి వంటి ఇబ్బందులను నిత్యం బాదం పప్పు తినడం ద్వారా కొంతమేర దూరం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే నిర్దిష్ట శారీరక కసరత్తుల్లో పనితీరును మెరుగుపరచుకోవచ్చని కూడా గుర్తించారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. బాదంపప్పు తిన్న బృందం త్వరగా కండరాల నొప్పి నుంచి కోలుకుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
ఖర్జూరాలను రోజూ తినొచ్చా: ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిని ఎలా తిన్నా ఎన్నో సమస్యలకు దూరంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నానబెట్టిన ఖర్జూరాలను రోజూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది