కృత్రిమ మేధ ఆధారిత సేవల మార్కెట్ మనదేశంలో ఏటా 25-35% వృద్ధిని సాధిస్తుందని నాస్‌కామ్ తాజా నివేదికలో పేర్కొంది. 2027 నాటికి ఏఐ మార్కెట్ దేశీయంగా 17 బిలియన్ డాలర్ల(సుమారు రూ.1.41 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని వివరించింది.
టెక్నాలజీకి బడ్జెట్ కేటాయింపులు పెరగడం, మానవ వనరుల లభ్యత, ఏఐ సేవలకు ప్రాధాన్యం ఈ వృద్ధికి దోహదపడతాయని విశ్లేషించింది.