దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 గంటల సమయంలో సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 73,116 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 22,215 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా, JSW స్టీల్, టాటా స్టీల్ ఉదయం సెషన్‌లో లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, TCS, HCL టెక్ షేర్లు వెనుకబడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.91 వద్ద ప్రారంభమైంది.