ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ స్టోక్స్ నాలుగో టెస్టులో బౌలింగ్ చేయన్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంగా ఈ సిరీస్ లో కేవలం బ్యాటర్‌గానే సేవలందిస్తున్న స్టోక్స్ తిరిగి బంతి చేతపట్టే అవకాశం ఉంది. ‘నేను ఖచ్చితంగా బౌలింగ్ చేస్తానని, చేయనని కూడా చెప్పలేను. నాపై వర్క్‌లోడ్ ఎలా ఉందనే విషయమై వైద్య సిబ్బందితో చర్చిస్తున్నా. సన్నాహకాల్లో అయితే వంద శాతం బౌలింగ్ చేయగలిగాను’ అని స్టోక్స్ తెలిపాడు.