భారత్‌తో సహా పలు దేశాల్లో నగదు బదిలీ, చెల్లింపుల కోసం గూగుల్ పే(Google Pay)ను చాలా మంది వినియోగిస్తున్నారు. మన దేశంలో కోట్లాది మంది ప్రజలు గూగుల్ పే నిత్యం వాడుతున్నారు.
ఈ క్రమంలో గూగుల్ పే నిలిచిపోనుందనే వార్త సంచలనంగా మారింది. అయితే కేవలం అమెరికాలో జూన్ 4, 2024 నాటికి ఇది షట్‌డౌన్ అవుతుందని గూగుల్ వెల్లడించింది. అమెరికాలో గూగుల్ వాలెట్ వచ్చిన తర్వాత గూగుల్ పే వినియోగం తగ్గిపోయింది.