కొబ్బరి నీరును సీజన్‌తో సంబంధం లేకుండా చిన్నలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఎండ వేడిని తట్టుకునేందుకు చాలా మంది సమ్మర్‌లో కొబ్బరి నీటిని అధికంగా త్రాగుతూ శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడుకుంటారు. కొబ్బరి నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలసటను తగ్గించి శక్తిని అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాలస్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.