కొన్ని చిన్నచిన్న పనులను మీ రోజువారి అలవాట్లలో చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గేయవచ్చు. టీవీ చూస్తూనే కొన్ని పుషప్స్ చేయడం, బ్రష్ చేస్తున్నప్పుడు కొన్ని గుంజీలు తీయండం వంటివి చేయడం వల్ల బాడీకి ఎక్సర్ సైజ్ అవుతుంది. మన జీవక్రియకు తోడ్పడే లవంగం, దాల్చిన చెక్క, పసుపు, ఎర్ర మిరియాలు, అల్లం వంటి పదార్థాలు రోజూ మీ డైట్లో ఉండే విధంగా చూసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు.
రోజూ ఓట్స్ తింటున్నారా: బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో ఓట్స్‌ని చేర్చుకుంటారు. అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఓట్స్‌ని ఉడకబెట్టి తింటే ప్రయోజనం ఉంటుంది. అంతేకాక ఓట్స్‌తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉదయం పరగడుపున తీసుకోవటం మంచిది. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తుంది.