భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సర్జరీ చేయించుకున్నారు. పిక్కల కింద ఉండే కండరానికి విజయవంతంగా సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కోలుకునేందుకు కాస్త టైం పడుతుందని, వీలైనంత త్వరగా కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
గాయం కారణంగా గడచిన కొన్ని నెలలుగా ఆయన టీమ్ ఇండియాకు దూరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది IPL, T-20 వరల్డ్ కప్ కు షమీ అందుబాటులో ఉండరని BCCI వర్గాలు పేర్కొన్నాయి.