రాత్రి ఎంత సేపు నిద్రపోయినా పొద్దున్నే లేవాలంటే బద్దకంగా ఉంటోందా? అయితే నిద్ర లేవగానే రెండు అరచేతులను ఒకదానికొకటి బాగా రుద్దాలి. వేడిగా ఉన్న అరచేతులను కళ్లపై ఉంచడం వల్ల నిద్రమత్తు పోతుంది. కళ్లలోని సున్నిత రక్తనాళాలు చురుగ్గా మారతాయి. నిద్రలేవగానే మంచం నుంచి కిందకు దిగేటప్పుడు కుడి వైపు నుంచి దిగాలి. ఎడమ వైపు నుంచి లేవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కుడి వైపు నుంచి పైకి లేవాలి.