అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 72,394 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 21,960 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో రిలయన్స్, టైటన్, మారుతీ, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.