అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్లలో ఒకడైన మరైస్ ఎరాస్మస్ వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట సిరీస్ తనకు ఆఖరిదని 60 ఏళ్ల వయసున్న తెలిపాడు. ‘అంపైర్‌గా లభించే గౌరవాన్ని, పర్యటనలను మిస్ అవుతాను. అయితే.. అంపైర్‌గా ఎన్నో రోజులు సేవలందించాను. ఇకపై బోరింగ్ లైఫ్ కోసం ఎదురుచూస్తున్నా’ అని ఎరాస్మస్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని ప్రకటించారు. ఎరాస్మస్ 18 ఏళ్ల క్రితం అంపైరింగ్‌లోకి ప్రవేశించాడు. ఎన్నో మెగా టోర్నీలకు ఆయన బాధ్యతలు నిర్వహించారు. అతను 43 టీ20లు, 115 వన్డేలు, 78 టెస్టులకు అంపైర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ అంపైర్‌గా గుర్తింపు పొందిన అతను డేవిడ్ షెపర్డ్ ట్రోఫీని మూడుసార్లు గెలుచుకున్నాడు.