గత వైసీపీ ప్రభుత్వంలో పల్లెలను పూర్తిగా విస్మరించి ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేసిందని, కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలసలో రూ. 52 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వైసిపి ప్రభుత్వం నిధులను సొంత పనులకు వినియోగించుకొని రోడ్లు, డ్రైన్లు, కాలువలు వంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు.