ఇసుక కోసం వాగులో దిగిన నలుగురు యువకులు గల్లంతైన ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం అడ్డతీగల మండలం తిమ్మాపురంలో అనధికారికంగా నిర్వహిస్తున్న క్వారీలో దిగిన కాకినాడ జిల్లా ఏలేశ్వరం వాసులు భూషణం, బాబు, గొంతయ్య, శ్రీను గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ ఘటనా స్థలిని సందర్శించారు. పోలీసులు ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు.